మోదీని ఎదుర్కోలేకే కాంగ్రెస్ మైండ్ గేమ్ : బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

మోదీని ఎదుర్కోలేకే కాంగ్రెస్ మైండ్ గేమ్ : బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
  • న్యాయవ్యవస్థపై దాడిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి
  • బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్  

హైదరాబాద్, వెలుగు: న్యాయవ్యవస్థపై కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న బహిరంగ దాడిని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో నర్సయ్య మీడియాతో మాట్లాడారు.

దేశంలో కృత్రిమ సంక్షోభం సృష్టించి, విదేశీ శక్తుల అండతో ప్రజాస్వామ్య వ్యవస్థలను అస్థిరపరిచేందుకు రాహుల్ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదిలి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.

13 కోట్ల ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ గాంధీ టీమ్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, మోదీ పాలనపై మాట్లాడే సత్తా లేకనే కాంగ్రెస్ ఈ మైండ్ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా రాష్ట్రంలో ఏ పోలింగ్ బూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైనా రావాలని, మీడియా సమక్షంలో ఓట్లపై నిగ్గుతేలుద్దామని సవాల్ విసిరారు.