క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో బోపన్న జోడీ

క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో బోపన్న జోడీ

మియామీ : ఇండియా వెటరన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ రోహన్‌‌‌‌‌‌‌‌ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రేలియా) జోడీ.. మియామీ ఓపెన్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌సీడ్‌‌‌‌‌‌‌‌ బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ 7–5, 7–6 (3)తో మెనెగాస్క్‌‌‌‌‌‌‌‌ హుగో నైస్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)–జాన్‌‌‌‌‌‌‌‌ జెలెన్‌‌‌‌‌‌‌‌స్కీ (పోలెండ్‌‌‌‌‌‌‌‌)పై గెలిచారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఇండో–ఆసీస్‌‌‌‌‌‌‌‌ ద్వయం నాలుగు ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టింది.

తమ సర్వీస్‌‌‌‌‌‌‌‌లో 84 శాతం పాయింట్లు గెలిచింది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌11వ గేమ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యర్థుల సర్వీస్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి బోపన్న–ఎబ్డెన్‌‌‌‌‌‌‌‌ 6–5 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు. 12వ గేమ్‌‌‌‌‌‌‌‌లో రెండు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు కాచుకుని సెట్‌‌‌‌‌‌‌‌ను సాధించారు. రెండో సెట్‌‌‌‌‌‌‌‌లోనూ ఇరుజట్లు సర్వీస్‌‌‌‌‌‌‌‌లు కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. అయితే టైబ్రేక్‌‌‌‌‌‌‌‌లో ఇండో–ఆసీస్‌‌‌‌‌‌‌‌ జోడీ వరుస పాయింట్లు నెగ్గి విన్నర్స్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు.