
- బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేశ్ డిమాండ్
ఓయూ, వెలుగు : ఫ్రీడమ్ ఫైటర్ ఉద్ధమ్ సింగ్ స్మృతివనం, ఇంటర్నేషనల్ స్టడీ సెంటర్ ను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉద్దమ్ సింగ్ జయంతి సందర్భంగా ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఉద్దమ్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేశ్ మాట్లాడుతూ.. ఉద్దమ్ సింగ్ జీవిత చరిత్రపై పరిశోధనలు జరగాలన్నారు.
కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు అరెకంటి శ్రీకాంత్ పాల్గొన్నారు.