ఉక్రెయిన్కు అండగా ఉంటాం

ఉక్రెయిన్కు అండగా ఉంటాం

ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యపై బ్రిటన్ స్పందించింది. ఉక్రెయిన్ ప్రజలకు తాము అండగా ఉంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు. అక్కడ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. నియంతలా మారిన పుతిన్, ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూ రష్యా క్రూరత్వాన్ని ప్రపంచదేశాలకు తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆయిల్, గ్యాస్ విషయంలో రష్యాపై ఆధారపడటం తగ్గించుకోవాలని బ్రిటన్ ప్రధాని పిలుపుని్చచారు. మరోవైపు బ్రిటన్ రక్షణ కోసం ఏం చేసేందుకైనా సిద్ధమేనన్న జాన్సన్.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.