అప్పు తీసుకోవడం..అడిగితే బెదిరించడం

అప్పు తీసుకోవడం..అడిగితే బెదిరించడం

కేపిహెచ్​బీకాలనీ, వెలుగు: అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యను తిట్టి..ఆమె ఆత్మహత్యకు కారకుడైన వ్యక్తిని కేపీహెచ్ బీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..వెస్ట్ గోదావరి జిల్లా నల్లాజిర్ల గ్రామానికి చెందిన పృథ్వీ గణేశ్, కృష్ణవేణి దంపతులు ఆరేళ్లుగా కేపీహెచ్ బీలోని ధర్మారెడ్డి కాలనీలో ఉంటున్నారు. గణేశ్​హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వెలుపల సతీశ్(28) కేపీహెచ్ బీలోని రోడ్ నం.5 ఎల్ఐజీ 913లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. సతీశ్​కు గణేశ్ తో పరిచయం ఉంది. దీంతో రూ.9లక్షలను గణేశ్​ వద్ద 8 నెలల క్రితం సతీశ్​తీసుకున్నాడు. రెండు నెలల్లో డబ్బు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన సతీశ్​ గడువు తేదీ ముగిసినా ఇవ్వకుండా వాయిదాలు పెట్టసాగాడు.  ఈ నెల 9న సాయంత్రం 7గంటలకు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుపోవాలని గణేశ్​కు ఫోన్ చేసి చెప్పాడు. గణేశ్, అతడి భార్య కృష్ణవేణి, ఫ్రెండ్ బాలాజీతో కలిసి సతీశ్​ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సతీశ్ వారిని చూడగానే ఇష్టం వచ్చినట్టు తిడుతూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.

చేసేదేమీ లేక గణేశ్, కృష్ణవేణి, బాలాజీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  సతీశ్​అదే రోజు రాత్రి 8.30గంటలకు గణేశ్​ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. తననే డబ్బులు అడుగుతావా అంటూ గణేశ్​ఫోన్ పగులగొట్టాడు. ఈ సమయంలో గణేశ్​భార్య కృష్ణవేణి సతీశ్​ను అడ్డుకుంది. డబ్బులు ఇవ్వకుండా తిరిగి మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నావ్ అంటూ ఆమె సతీశ్​ను నిలదీసింది. తాగిన మైకంలో ఉన్న సతీశ్​కృష్ణవేణిని అసభ్యకరంగా తిట్టాడు. మనస్థాపానికి గురైన కృష్ణవేణి ఈ నెల 10న తెల్లవారుజామున 5.50గంటలకు ఇంట్లో ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించి భర్త గణేశ్ స్థానికుల సాయంతో ఆమెను రెమిడీ హాస్పిటల్ కు తరలించగా..అప్పటికే కృష్ణవేణి చనిపోయినట్టు అక్కడి డాక్టర్లు తెలిపారు.  గణేష్​ కేపిహెచ్​బీ పోలీసులకు కంప్లయింట్ చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం ఉదయం 8 గంటలకు కృష్ణవేణిని తిట్టి ఆమె ఆత్మహత్యకు కారకుడైన నిందితుడు వెలుపల సతీష్​ను అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై సక్రం తెలిపారు.