,-CII-report-that-OTT-market-will-expand-to-1.12-trillion_1cTulKrsxR.jpg)
న్యూఢిల్లీ: దేశంలో ఓవర్ ది టాప్ (ఓటీటీ) ఇండస్ట్రీ మరింత విస్తరిస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ), సీఐఐ తీసుకొచ్చిన రిపోర్ట్ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో ఓటీటీ ఇండస్ట్రీ వాల్యూ 13–15 బిలియన్ డాలర్లకు (రూ. 1.12 లక్షల కోట్లకు) పెరుగుతుందని తెలిపింది. ‘వచ్చే పదేళ్లలో దేశ ఓటీటీ ఇండస్ట్రీ ఏడాదికి 22–25 శాతం వృద్ధి చెందుతుంది’ అని ఈ రిపోర్ట్ పేర్కొంది. దేశంలో ఓటీటీ మార్కెట్ నిలకడగా గ్రోత్ సాధిస్తోంది. ప్రస్తుతం 40 పైగా కంపెనీలు అన్ని రకాల కంటెంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఆరేళ్ల కిందటి కంటే ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య రెండింతలు పెరిగారు. ఇంకా డిజిటల్ పేమెంట్స్ వాడకం కూడా ఎగిసింది. ఇవన్నీ ఓటీటీ మార్కెట్‌కు ప్లస్‌గా మారాయని సీఐఐ–బీసీజీ రిపోర్ట్ అభిప్రాయపడింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి విదేశీ కంపెనీలు యూఎస్‌లో కంటే ఇండియాలో 70–90 శాతం తక్కువ రేటుకే కంటెంట్‌ను ఆఫర్ చేస్తున్నాయి. వీటికి అదనంగా లోకల్ కంటెంట్ కోసం భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి.