పనికి రాని చెట్లనే తొలగించాం .. అవన్నీ అపోహలే : అగ్రి వర్సిటీ వీసీ జానయ్య

పనికి రాని చెట్లనే తొలగించాం .. అవన్నీ అపోహలే : అగ్రి వర్సిటీ వీసీ జానయ్య

గండిపేట, వెలుగు: గత రాత్రి బొటానికల్ గార్డెన్‌‌‌‌ పరిసరాల్లో జరిగిన చెట్ల తొలగింపు చర్యలు విద్యార్థుల్లో కొన్ని అపోహలు సృష్టించాయని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ జానయ్య తెలిపారు. యూనివర్సిటీలో మొట్టమొదటి వనమహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం ఆయన మాట్లాడారు.

 బొటానికల్ గార్డెన్​లో హెచ్‌‌‌‌ఎండీఏ అధికారులు కొన్ని పనికిరాని చెట్లను మాత్రమే తొలగించి, మంచి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారన్నారు. అర్ధరాత్రి జరిగిన పనుల వల్ల కొన్ని మిస్‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌లు ఏర్పడి విద్యార్థులు ఆందోళనకు లోనయ్యారన్నారు. పాత వీడియోలు సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ కావడంతో అపోహలు ఏర్పడినట్లు చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా150 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.