రాణిస్తున్న బౌలర్లు..96 పరుగులకే 4 వికెట్లు డౌన్

రాణిస్తున్న బౌలర్లు..96 పరుగులకే 4 వికెట్లు డౌన్

పాక్ తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన పాక్..మొదట్లోనే  రెండు కీలక వికెట్లు కోల్పోయింది. పాక్  కెప్టెన్ బాబర్ ఆజమ్ 9 బంతుల్లో 10.. 2 ఫోర్లు ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన ఫకర్ జమాన్ 10 పరుగులే చేసి పెవీలియన్ బాటపట్టాడు. తొలి ఓవర్లోనే పొదుపుగా బౌలింగ్ చేసిన భువీ.. రెండో ఓవర్ నాలుగో బంతికే పాక్ కెప్టెన్ ను బోల్తా కొట్టించాడు. భువీ బౌలింగ్ లో షాట్ బంతిని బాబర్ భారీ షాట్ కు ప్రయత్నించగా.. టాప్ ఎడ్జ్ కు తాకి అర్ష్‌దీప్ సింగ్ చేతుల్లో పడింది. దీంతో పాకిస్తాన్ 15 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ ను కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన ఫకర్ జమాన్.. రెండు ఫోర్లు కొట్టి  జోరు మీద కన్పించాడు. అయితే అవేశ్ ఖాన్ వేసిన ఆరో ఓవ్లో జమాన్.. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ ను హార్థిక్ పాండ్యా ఔట్ చేయడంతో పాక్ 87 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్న ఓపెనర్ రిజ్వాన్ రెచ్చిపోయాడు. ఫోర్లు సిక్సర్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే రిజ్వాన్ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా అతన్ని పెవీలియన్ చేర్చాడు. దీంతో పాక్ 96 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది.