ఇబ్రహీంపట్నం, వెలుగు: మతిస్థిమితం లేని ఓ దివ్యాంగుడిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఓ ప్రభుత్వ స్కూల్లో 21 ఏండ్ల మతిస్థిమితం లేని యువకుడు ఉండగా, ఓ బాలుడు వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గాయాలు కావడంతో బాధితుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
