ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలుడు మృతి

 ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలుడు మృతి

హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్యనగర్ లో తెల్లవారుజామున హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న టీవీఎస్ షోరూంలో ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి బాలుడు చనిపోయాడు. టీవీఎస్ షోరూం ఉన్న భవనానికి తూర్పుగోదావరికి చెందిన అర్జున్ వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అర్జున్ తన భార్య, కుమారుడితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఉదయం టీవీఎస్ షోరూంకు ఉన్న ఆటోమేటిక్ షెట్టర్ తెరుచుకోవటంతో పక్కనే ఉన్న పదేళ్ల రాజేష్ అందులో ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన స్థానికులు షెట్టర్ ను కిందకు దించి రాజేష్ ను బయటకు తీశారు. షెట్టర్ చుట్టేయడంతో తీవ్రగాయాలైన రాజేష్ అక్కడికక్కడే చనిపోయాడు.