
మక్తల్, వెలుగు: మట్టి మిద్దె కూలి బాలుడు మృతిచెందిన ఘటన నారాయణపేట జిల్లాలో జరిగింది. మక్తల్ మండలం అనుగొండ గ్రామానికి చెందిన సురేష్, జమున దంపతుల కొడుకు ఆదిత్య(10) శనివారం ఇంటిపక్కన ఉన్న పాడుబడిన మట్టి మిద్దెలోకి వెళ్లి ఆడుకుంటున్నాడు. ఒక్కసారిగా మట్టి మిద్దె కూలిపోవడంతో గోడ బాలుడిపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు మక్తల్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.