
జీడిమెట్ల, వెలుగు: సూరారంలో కరెంట్షాక్తగిలి బాలుడు మృతి చెందాడు. కైసర్‌నగర్‌కు చెందిన మహ్మద్ అలీమ్ ఖాన్కొడుకు ఎజాజ్(13) స్థానిక అరబిక్ పాఠశాలలో చదువుతున్నాడు. ఖాళీగా ఉన్న సమయంలో స్క్రాప్ ఏరుకొని విక్రయిస్తున్నాడు.
కైసర్‌నగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో సోమవారం సాయంత్రం విద్యుత్తు వైర్లను కట్టింగ్ ప్లేయర్‌తో కట్‌చేయడంతో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తగిలి
మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ భరత్‌కుమార్ తెలిపారు.