ఖమ్మం: బాలుడి అనుమానాస్పద మృతి

ఖమ్మం: బాలుడి అనుమానాస్పద మృతి

ఖమ్మం నగరంలో బాలుడి అనుమానస్పద మృతి సంచలనంగా మారింది. నాలుగు రోజుల కిందట కనిపించకుండా పోయిన బాలుడు… ఇవాళ ఉదయం శవమై కనిపించాడు. కాల్వడ్డు బొక్కల బజార్ కు చెందిన ప్రేమ్ సాగర్ నాలుగు రోజుల కిందట ఇంట్లో నుంచి వెళ్లాడు. అదేరోజు మున్నేరు కాలువలో ఓబాలుడు దూకాడాని తల్లిదండ్రులకు సమాచారం అందింది. మూడు రోజులపాటు కాలువలో వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు. తీరా ఉదయం వాళ్లింటి పక్కనే ఉన్న పాడుబడ్డ ఇంట్లో గుమ్మానికి ఉరేసుకుని శవమై కనిపించాడు. బాలుడిది హత్య లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.