మాస్ డైరెక్టర్ బోయపాటితో.. హీరో సూర్య 

మాస్ డైరెక్టర్ బోయపాటితో.. హీరో సూర్య 

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసే సినిమా కథలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెలిసిన విషయమే.ఇపుడు అంతకి మించిన  ఊరమాస్ కథని ఒక స్టార్ హీరోకి వినిపించాడని టాక్ వినిపిస్తోంది. తమిళ్ స్టార్ హీరో సూర్యతో మాస్ యాక్షన్ ఫిలిమ్ ని  పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగు లో మంచి మార్కెట్ తో పాటు అశేష అభిమానులని సొంత చేసుకున్నాడు హీరో సూర్య. ఈ కాంబో కనుక సెట్ అయితే రికార్డ్స్ క్రీయేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు సూర్య అభిమానులు. ఈ మూవీ ఎంత వరకు వాస్తవం అనేది ఇంకా క్లారిటీ లేదు.అధికారిక ప్రకటన వచ్చే వరకి ఎదురు చూడాల్సిందే 

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా పాన్ ఇండియా లెవెల్లో మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసేందే. ఈ మూవీ లో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.రీసెంట్ గా  రిలీజ్ అయినా రామ్ ర్యాపొ ఫస్ట్ గ్లిమ్స్ అదిరిపోయిందంటూ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. తాజాగా రామ్ ఈ సినిమా గురుంచి స్పందిస్తూ "24 రోజుల యాక్షన్ పార్ట్ పూర్తీ చేశాం..ఇది క్లైమాక్స్ కాదు..అంతకు మించి" అంటూ  చేసిన ట్వీట్ సోషల్ మిడియాలో వైరల్ అయిన విషయం తెలిసేందే. 

ప్రస్తుతం సూర్య కోలీవుడ్ లో శివ దర్శకత్వంలో కంగువ పేరుతో పీరియాడిక్ జోనర్ లో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ లో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ పూర్తయ్యాక బోయపాటితో మూవీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.