చైనీస్ ఫుడ్​ బంజేయాలె.. రెస్టారెంట్లను బ్యాన్ చేయాలె

చైనీస్ ఫుడ్​ బంజేయాలె.. రెస్టారెంట్లను బ్యాన్ చేయాలె
  • కేంద్ర మంత్రి రామ్​దాస్ అథవాలె

న్యూఢిల్లీ: ఇండియన్లందరూ మేడ్–ఇన్ చైనా ఉత్పత్తులు బ్యాన్ చేయాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సూచించారు. చైనా ఫుడ్స్ కూడా తినడం బంజేయాలని ఆయన ప్రజలను కోరారు. ‘‘చైనా ఉత్పత్తులను బహిష్కరించడమే కాకుండా.. చైనాను

దెబ్బకొట్టేందుకు ఇండియన్ సిటిజన్లు తీసుకునే చర్యల్లో భాగంగా చైనా ఫాస్ట్ ఫుడ్స్ ను కూడా బ్యాన్ చేయాలి”అని ఆయన అన్నారు. ‘‘మన దేశ సైనికులను పొట్టనపెట్టుకున్న చైనాకు సంబంధించిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఆ దేశ ఫుడ్ అమ్ముతున్న హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేతకు అన్ని రాష్ట్రాలు ఆర్డర్స్ పాస్ చేయాలి. చైనీస్ ఫుడ్ తినేవారు కూడా మానుకోవాలి”అని మంత్రి కోరారు. లడఖ్​ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ జవాన్లు 20 మంది ప్రాణాల్ని బలిగొన్న చైనాకు బుద్ధి చెప్పాలని, ఆ దేశాలనికి సంబంధించిన వస్తువులను బ్యాన్ చేయాలని సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి అథవాలె గురువారం ఈ కామెంట్స్ చేశారు.