కాకా విద్యాసంస్థల్లో.. మాంటిస్సోరి స్కూల్​ ప్రారంభం

కాకా విద్యాసంస్థల్లో..  మాంటిస్సోరి స్కూల్​ ప్రారంభం

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల్లో చిన్నారుల కోసం మాంటిస్సోరి స్కూల్ ను ఏర్పాటు చేశారు. కాకా కుటుంబ సభ్యులు గడ్డం వంశీ, వెంకట్, వరుణ్, రోషిణి, రిత్విక, వైష్ణవి ముఖ్య అతిథులుగా పాల్గొని సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇదొక వైవిధ్యమైన విద్యా విధానమని, చిన్నారులు క్లాస్​రూమ్​లో వివిధ రకాల అభ్యసనాలతో నైపుణ్యాలు, క్రమశిక్షణను అలవర్చుకుంటారని చెప్పారు. కాకా ఆశయాలకు అనుగుణంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నాణ్యమైన విద్య అందించడం సంతోషంగా ఉందన్నారు.