యాదాద్రి, వెలుగు : పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలని సూచించారు. భువనగిరిలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సందర్శించారు. పాఠశాలలో అందిస్తున్న మౌలిక వసతులు, బోధన విధానాన్ని, టీచర్ల హాజరు, తరగతి గదులను, డార్మెటరీ హాల్ ను పరిశీలించారు. మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందిస్తున్నారా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో కష్టపడి చదివి ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
