కరీంనగర్, వెలుగు: రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఓ టెన్త్ విద్యార్థి ఆ సమస్యను అధిగమించి.. తోటి విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌ను రూపొందించాడు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మొలంగూరుకు చెందిన మోరె ఐలయ్య కొడుకు మనోహర్ స్థానిక జడ్పీ హైస్కూల్ లో టెన్త్ చదువుతున్నాడు. మనోహర్ రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురై డిప్రెషన్ లోకి వెళ్లాడు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సమస్యను అధిగమించాడు.
ఇదే టైంలో టెక్నాలజీపై పట్టు పెంచుకున్నాడు. అతడి ఇంట్రెస్ట్ ను గమనించిన స్కూల్ హెచ్‌ఎం కె.నీరజ.. ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు, పేద వర్గాలకు ఉపయోగపడేలా ఏదైనా చేయమని సూచించారు. దీంతో మనోహర్ హైస్కూల్ విద్యార్థులకు ఉపయోగపడేలా clickbook.Co అనే వెబ్ సైట్ ను రూపొందించాడు.
https://manoharmglad.wixstudio.com/clickbookco-p అనే యూఆర్ ఎల్ లో ఈ వెబ్ సైట్ అందుబాటులో ఉంది. ఇందులో 6 నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ ఉపయోగపడేలా ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీకి సంబంధించిన టెక్ట్స్ బుక్స్ లోని అన్ని అంశాలు, ఎంతో కఠినమైన వాటిని కూడా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా రూపొందించాడు.
