‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ మాకూ ఇవ్వండి.. రామాయ‌ణాన్ని గుర్తు చేస్తూ బ్రెజిల్ విజ్ఞ‌ప్తి

‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ మాకూ ఇవ్వండి.. రామాయ‌ణాన్ని గుర్తు చేస్తూ బ్రెజిల్ విజ్ఞ‌ప్తి

మాకు ఇవ్వండంటూ మోడీని కోరిన బ్రెజిల్ ప్రెసిడెంట్ జేర్‌ బోల్సోనారో

కరోనాకు హైడ్రాక్సీక్లోరోక్విన్ మంచిగా పనిచేస్తుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినప్పటి నుంచి ఈ మందుకు మస్తు గిరాకీ పెరిగింది. హైడ్రాక్సీక్లోరిక్విన్ ఉత్పత్తిలోనంబర్ వన్ గా ఉన్నఇండియా వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. తాజాగా బ్రెజిల్ కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాకు ఇవ్వండంటూ ఇండియాను కోరింది. ఆ దేశ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఈ మందు గేమ్ ఛేంజర్ అంటూ స్వయంగా లెటర్ రాశారు. హైడ్రోక్సీక్లోరోక్విన్ ను రామాయణ కాలం నాటి సంజీవనితో పోల్చారు బ్బోల్సోనారో. “రామాయణంలో హనుమంతుడు హిమాలయాల నుంచి ఔషధం తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడు. అనారోగ్యంతో ఉన్నవారిని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. బార్టిమేయుకు దృష్టిని ప్రసాదించాడు. అలాగే కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు భారత్‌, బ్రెజిల్ కలిసి పోరాడాలి. మా అభ్యర్థన గౌరవించి భరోసా ఇస్తారని భావిస్తున్నాను “  అని ప్రధాని మోడీకి రాసిన లెటర్ లో బ్రెజిల్‌ అధ్యక్షుడు జేర్‌ బోల్సోనారో పేర్కొన్నారు.

పాక్షికంగా ఆంక్షలు సడలింపు

హైడ్రాక్సీక్లోరోక్విన్‌ కోసం ప్రపంచ దేశాల నుంచి డిమాండ్ వస్తుండటంతో దీనిపై ఉన్న ఆంక్షలను భారత్ పాక్షికంగా ఎత్తివేసింది. కరోనాకు ఈ మందు పనిచేస్తుండటంతో భారత్ ఇటీవలే ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఐతే అమెరికా సహా పలు దేశాలు ఈ మందు కావాలని కోరటంతో కొన్ని దేశాలకు వీటిని ఎగుమతి చేయనున్నారు. భారత్ అవసరాలు తీరిన తర్వాతే ఎగుమతులు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరా చేయకపోతే ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఎగుమతులకు భారత్ అంగీకరించటంతో ట్రంప్ సర్వం మార్చి మెడీపై ప్రశంసలు కురిపించారు. మానవతాదృక్పథంతోనే కొన్నిదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని భారత్ తెలిపింది.