
రియో డీ జెనీరియో: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తమ దేశానికి త్వరగా పంపాలని భారత ప్రధాని మోడీకి బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సొనారో కోరారు. తమ దేశంలో వెంటనే ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలంటే వ్యాక్సిన్ షిప్‌మెంట్ ప్రక్రియను భారత్ వేగవంతం చేయాలన్నారు. ఈ నెలాఖరుకు బ్రెజిల్‌కు వ్యాక్సిన్ డోసులు చేరొచ్చునని సమాచారం. ఈ నేపథ్యంలో త్వరగా టీకా డోసులను పంపితే బాగుంటుందని మోడీకి బొల్సొనారో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బొల్సొనారో రాసిన ఓ లెటర్‌ను ప్రెస్ ఆఫీస్ విడుదల చేసింది.