జులై 17న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

జులై 17న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జులై 17న బ్రేక్​ దర్శనాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు స్వామివారికి సాలకట్ల ఆణివార ఆస్థాన కార్యక్రమం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో బ్రేక్​ దర్శనాలన్ని టీటీడీ రద్దు చేసింది. 

జులై 16న ఈ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని అధికారులు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య భారీగా ఉంది. 

టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. స్వామి దర్శనానికి మొత్తం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  గదుల కోసం రద్దీ కొనసాగుతోంది. స్వామి వారికి వచ్చే కానుకలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.