గోవాలో అశ్లీల వీడియో షూట్.. నటి పూనమ్ పాండే అరెస్ట్

V6 Velugu Posted on Nov 05, 2020

కానకోనా: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేను గోవా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నార్త్ గోవాలో అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించారని పూనమ్‌‌పై ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. దీనికి తోడు పూనమ్‌ పాండేపై అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించినందుకు ఓ గుర్తు తెలియని వ్యక్తిపై మరో కేసు నమోదైంది. గోవా గవర్నమెంట్‌‌కు చెందిన చంపోలీ డ్యామ్ వద్ద పార్న్ ఫొటోషూట్ చేసిందనేది పూనమ్‌‌పై వచ్చిన అభియోగం. సదరు వీడియో నెట్‌‌లో హల్‌‌చల్ కావడంతో షూటింగ్‌‌కు ఎలా అనుమతించారని గోవా సీఎంతోపాటు పోలీసు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫార్వర్డ్ పార్టీ ఫిర్యాదు మేరకు పూనమ్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tagged Canacona, goa, Police arrested, poonam pandey, video shooting

Latest Videos

Subscribe Now

More News