భూమి సర్వే చేసేందుకు 10 వేలు లంచం

భూమి సర్వే చేసేందుకు 10 వేలు లంచం

ఏసీబీకి చిక్కిన సర్వేయర్, కంప్యూటర్ ఆపరేటర్
దోమ  తహసీల్దార్ ఆఫీస్ -లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, వెలుగు: వికారాబాద్ జిల్లా దోమ మండలం తహసీల్దార్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రేమ్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ భాగ్యవతి తరఫున అతడు లంచం తీసుకుంటూ చిక్కాడు. అయినాపూర్ గ్రామానికి చెందిన చెందిన సయ్యద్ ఖాజా యాదుల్లా హుస్సేని 3 ఎకరాల భూమి సర్వే కోసం సర్వేయర్ భాగ్యవతి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో హుస్సేన్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. సర్వేయర్ భాగ్యవతి వేరే పనిమీద వెళ్లడంతో ఆపరేటర్ కు డబ్బులు ఇవ్వాలని సూచించారు. ఆపరేటర్ కు హుస్సేన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర సర్వేయర్  ఫోన్ రికార్డు తీసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.