కరోనా పై పోరుకు భారత్ కు బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయం

కరోనా పై పోరుకు భారత్ కు  బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆర్థిక సహాయం

షాంఘై : కరోనా పై పోరులో భారత్ కు ఆర్థికంగా బ్రిక్స్ న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ అండగా నిలిచింది. ఎమర్జెన్సీ ఫండ్ కింద మన దేశానికి బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించింది. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులు ప్రకటించారు. బ్రిక్స్ దేశాల డెవలప్ మెంట్ కు ఆర్థికంగా అండగా ఉండేందుకు కొన్ని సంవత్సరాల క్రితం అన్ని దేశాలు ఈ బ్యాంక్ ను ఏర్పాటు చేసుకున్నాయి. కరోనా తో దాదాపు బ్రిక్స్ లో ఉన్న బ్రెజిలి, రష్యా, ఇండియా, చెనా, సౌత్ ఆఫ్రికా దేశాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఆయా దేశాలకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. దీంతో మన దేశానికి తక్షణ సహాయంగా బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఏప్రిల్ 30 నే బ్యాంక్ డైరెక్టర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మనదేశానికి ఈ లోన్ ను ఇచ్చారు. 2020 జనవరి 1 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పెట్టే ఖర్చంతా ఎమర్జె్న్సీ అసిస్టెన్స్ ప్రొగ్రాం లోన్ కిందకే వస్తుంది. ఈ డబ్బు కరోనా నివారణకు అదే విధంగా లాక్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వారికి సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని బ్యాంక్ అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా పై పోరుకు పలు ఇంటర్నేషనల్ బ్యాంక్ లు అమెరికా లాంటి దేశాలు మనకు ఆర్థిక సహాయం అందించాయి.