Ahmedabad:సిగరెట్‭తో అల్లుడికి ఆహ్వానం

Ahmedabad:సిగరెట్‭తో అల్లుడికి ఆహ్వానం

కొంతమంది ఆచార సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ విషయం వారికి తెలిసినా కూడా.. పూర్వికుల నుంచి వస్తున్న ఆచారాలు అని పాటిస్తూ ఉంటారు. తమ పిల్లలకు కూడా అదే నేర్పిస్తారు. తాజాగా అహ్మదాబాద్‭లోని ఓ పెళ్లి వేడుకలో వరుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎక్కడైనా వరుడిని ఆహ్వానించేటప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు టపాసులు పేల్చో లేక నృత్యాలతోనో లేక హారతులలో స్వాగతం పలుకుతారు. కాని ఇక్కడ విచిత్రంగా వధువు తల్లిదండ్రులు వరుడికి సిగరెట్ వెలిగించి పెళ్లితంతుకు ఆహ్వానించడం షాకింగ్‭గా ఉంది. బ్లాగర్ జుహీ కే పటేల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల నుంచి పలురకాల కామెంట్లు వస్తున్నాయి. కొందరు గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ఈ సంప్రదాయం ఉందని చెబుతుంటే.. మరికొందరు అసలు ఇదేం సంప్రదాయమని కామెంట్లు పెడుతున్నారు.