బ్రాడెండ్ లేబుల్.. కల్తీ సరుకు.. హైదరాబాద్ సిటీ జనం ప్రాణాలతో చెలగాటం

బ్రాడెండ్ లేబుల్.. కల్తీ సరుకు.. హైదరాబాద్ సిటీ జనం ప్రాణాలతో చెలగాటం

ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతాం.. ఇంట్లో కావొచ్చు.. బయట టీ స్టాల్స్ దగ్గర కావొచ్చు.. అంతేనా.. వంటింటి వంట నూనె లేకుండా పని గడుస్తుంటా ఏంటీ.. అబ్బే అస్సలు ఉండదు.. ఇక బాత్ రూం క్లీనింగ్ ఆయిల్స్ అయితే డబ్బాలు డబ్బాలు తెచ్చుకుంటాం.. మీరు ఇంటికి తెచ్చుకునే ఇలాంటివి అన్నీ బ్రాండెడ్ తెచ్చుకుంటున్నాం.. మంచివి.. నాణ్యతతో ఉన్నాయి అనుకుంటే.. పప్పుతో కాలేసినట్లే.. అవును.. ఇప్పుడు హైదరాబాద్ జనం ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముఠా గుట్టు రట్టుతో.. సిటీ జనం మొత్తం షాక్ అయ్యారు.. అవాక్కయ్యారు.. తల పట్టుకుంటున్నారు.. 

హైదరాబాద్ సిటీలో కల్తీ, నకిలీ సరుకు తయారు చేస్తు్న్న ముఠాను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. వీళ్లు తయారు చేస్తున్న సరుకు చూస్తే జనం ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆదుతున్నారో అర్థం అవుతుంది. లేబుల్స్ మాత్రం బ్రాండెడ్.. సరుకు మాత్రం కల్తీ.. రెడ్ లేబుల్ స్టిక్కర్ తో రంపపు పొడితో టీ పౌడర్స్ తయారు చేస్తున్నారు. అదే విధంగా బ్రూక్ బాండ్ పేరుతో నకిలీ టీ పౌడర్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. అంతేనా.. హార్పిక్, లైజోన్, సర్ఫ్ ఎక్సెల్ వంటి బాత్ రూం క్లీనింగ్ ఆయిల్స్ తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ లేబుల్స్ వేసి.. కల్తీ సరుకును నింపి.. హైదరాబాద్ సిటీలోని బస్తీల్లో వీటిని విక్రయిస్తున్నారు.

ఇవే కాదు.. పారాచూట్ కొబ్బరినూనె, ఎవరెస్ట్ మసాలా వంటి వాటిని కూడా ఆయా బ్రాండెడ్ లేబుల్స్ తో.. వీళ్లు తయారు చేసిన కల్తీ సరుకును నింపి.. వాటిని మార్కెట్ లో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు ఈ ముఠా. హైదరాబాద్ సిటీ శివార్లలోని కాటేదాన్, నాగారం ఏరియాల్లో పెద్ద పెద్ద గోదాముల్లో వీటిని తయారు చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఈ ముఠాకు చెందిన తయారు కేంద్రాల్లో అక్షరాల 2 కోట్ల రూపాయల సరుకును పోలీసులు సీజ్ చేశారంటేనే అర్థం అవుతుంది.. ఏ స్థాయిలో కల్తీ, నకిలీ ప్రాజెక్టులను వీరు మార్కెట్ లో విక్రయిస్తున్నారు అనేది. పట్టుబడిన సరుకే 2 కోట్ల రూపాయలు ఉంటే.. ఇప్పటికే మార్కెట్ లో ఎన్ని కోట్ల రూపాయల కల్తీ, నకిలీ సరుకు అమ్మారు అనేది ఇప్పుడు విచారణ చేస్తున్నారు పోలీసులు. 

ఈ ముఠాలో ముగ్గురు అరెస్ట్ అవ్వగా.. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు అని చెబుతున్నారు పోలీసులు. బ్రాండెడ్ ప్రాడెక్ట్స్.. తక్కువ ధర అంటూ హైదరాబాద్ సిటీలోని కిరాణా షాపులకు విక్రయిస్తున్నారని.. తక్కువ ధరకే బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ వస్తున్నాయనే ఆశతో జనం వీటిని కొనుగోలు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంత మంది డిస్ట్రిబ్యూటర్లతోనూ ఈ నకిలీ, కల్తీ ముఠాకు సంబంధం ఉందని.. విచారణ చేస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు పడితేకానీ.. జనం ఆరోగ్యం బాగుపడదు..