
హైదరాబాద్: కుత్బుల్లాపూర్లో కరెంట్ వైర్లు తెగిపడి ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. ప్రమాదవ శాత్తు కరెంట్ వైర్లు తెగిపోయి బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై పడటంతో విద్యుత్ షాక్ సత్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లంపేట ఆకాష్ లేఔట్ లో ఆగస్ట్ 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సత్యనారాయణతో పాటు మూగ జీవం పంది కూడా షాక్ గురై మృతిచెందింది. జనావాసాల మధ్య విద్యుత్ వైర్లు తెగిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారమణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏ వైరు తెగిపడుతుందోనని ఆందోళన వ్యక్త చేస్తున్నారు.