ఏటీసీ ఇండియాను కొననున్న బ్రూక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్

ఏటీసీ  ఇండియాను కొననున్న బ్రూక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్

న్యూఢిల్లీ :  టెలికం ఇన్​ఫ్రా కంపెనీ అమెరికన్ టవర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు (ఏటీసీ) చెందిన భారతీయ వ్యాపారాన్ని 2.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.20.78 కోట్లు) కొనుగోలు చేస్తామని కెనడియన్ సంస్థ బ్రూక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ప్రకటించింది. ఇందులో గత అక్టోబరు నుంచి వచ్చే 'టిక్కింగ్ ఫీజు'తో పాటు ఏటీసీ ఇండియాపై రెండు బిలియన్ డాలర్ల ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ విలువ కూడా ఉంది. ఈ డీల్​ రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి ఉంటుంది. ఈ ఏడాది జూన్​ తరువాత ముగుస్తుంది.

ఈ మేరకు  బ్రూక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్  అనుబంధ సంస్థ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రస్ట్ డేటా ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ (డీఐటీ) ఏటీసీతో ఒప్పందంపై సంతకం చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ఎంటర్​ప్రైజ్​విలువ16,500 కోట్లని తెలిపింది. ఇది సెక్యూరిటీల కొనుగోలు ఒప్పందం ప్రకారం ప్రీ-క్లోజింగ్ నిబంధనలకు లోబడి ఉంటుందని డీఐటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏటీసీ ఇండియాకు భారతదేశం అంతటా సుమారు 78,000 సైట్లు ఉన్నాయి.  బ్రూక్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ కూడా దాదాపు 1,75,000 టవర్ల పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియోను కలిగి ఉంది. వీటిని 2020లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసింది.