బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ గెలవగానే గిరిజన బంధు : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ గెలవగానే గిరిజన బంధు : ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు
  •     గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట
  •     కొత్తగా వచ్చినోళ్ల మాటలు నమ్మితే మోసపోతం
  •     మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌

తొర్రూరు, వెలుగు : బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిజన బంధు పథకం ప్రవేశపెట్టనున్నట్లు పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా తొర్రూరులో బుధవారం జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యతి రాథోడ్‌‌‌‌‌‌‌‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సీఎం కాకముందు తండాల పరిస్థితి ఎలా ఉందో ? ఇప్పుడు ఎలా ఉందో గిరిజనులు ఆలోచించుకోవాలని చెప్పారు.

గతంలో తాగునీళ్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, కానీ ప్రస్తుతం మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ కార్యక్రమంతో ప్రతి ఇంటికీ మంచినీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. తండాలను పంచాయతీలుగా మారుస్తామని 2009లో మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఆ పని పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌దేనన్నారు. గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని, వీటి వల్ల ఎంతో మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారన్నారు. అధికారంలోకి రాగానే రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డు ఉన్నవారికిసన్న బియ్యం, రూ. 400లకే గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌ ఇస్తామన్నారు.

ఎన్నికలు అనగానే వలస పక్షుల మాదిరిగా ఎవరెవరో వస్తారని, వారి మాటలు నమ్మి మన భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను పణంగా పెట్టొద్దని చెప్పారు. కరోనా టైంలో ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్లు, మందులు పంపిణీ చేశానని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎన్నోసార్లు మెగా జాబ్‌‌‌‌‌‌‌‌మేళా సైతం నిర్వహించామని గుర్తు చేశారు. అంతకుముందు పెద్దవంగర మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రామచంద్రయ్య, గాంధీనాయక్, బిందు శ్రీను, రాజేస్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, ఖాలూ నాయక్‌‌‌‌‌‌‌‌, సోమన్న, కిషన్‌‌‌‌‌‌‌‌ నాయక్, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

గిరిజనులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ రుణం తీర్చుకోవాలి 

తండాలను పంచాయతీలుగా మార్చిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను భారీ మెజార్టీతో గెలిపించి రుణం తీర్చుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే మహిళలకు నెలకు రూ.3 వేలు, రైతులకు రూ.16 వేలు ఇస్తామన్నారు. నలభై ఏళ్లు ప్రజల మధ్యే ఉన్న దయాకర్‌‌‌‌‌‌‌‌రావును మరోసారి గెలిపించుకోవాలని సూచించారు.