గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా : జాన్సన్ నాయక్

గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా : జాన్సన్ నాయక్

జన్నారం/కడెం, వెలుగు : ఖానాపూర్​నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపితే ఇక్కడి యువతీయువకులకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ హామీ ఇచ్చారు. బుధవారం జన్నారం మండలం ఇందన్ పల్లి, మొర్రిగూడ, కిష్టాపూర్, దేవునిగూడ, కవ్వాల్, కామన్ పల్లి తదితర గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించగా ఆయనకు మహిళలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. వే ర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జాన్సన్ పాల్గొని మాట్లాడారు.

బీఆర్ ఎస్ సర్కారు రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎన్నికలు పూర్తికాగానే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చా రు. ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు.

ఈ  కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, ఎంపీపీ మాదాడి సరోజ, వైస్ ఎంపీపీ సుతారి వినయ్, పార్టీ మండల అధ్యక్షుడు రాజారాం, నాయకులు భరత్, గంగాధర్, ఫజల్ ఖాన్, రియాజుద్దీన్, సుశీల తదితరులు పాల్గొన్నారు. కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన యువకులు జాన్సన్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.  గ్రామ అధ్యక్షుడు ముత్తినేని శివయ్య, కాసుల రాజేశ్, మాదాసు జలేందర్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : భలే చౌకబేరం : కిలో చికెన్ 150 రూపాయలు మాత్రమే

ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారం

జాన్సన్ నాయక్ కు మద్దతుగా పార్టీ నియోజకవర్గ వార్ రూం ఇన్ చార్జ్ బక్కశెట్టి కిషోర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక మార్కెట్​లోని వ్యాపారులు, ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. నాయకులు రాజేందర్ గౌడ్, బక్కశెట్టి లక్ష్మణ్, కాసారం మల్లయ్య తదితరులు ఉన్నారు.