లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఫేక్ కరెన్సీ సర్క్యులేట్ చేసిన ముఠాలోని 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ ఆర్ ప్రకాశ్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25న ఇటిక్యాలలోని పెట్రోల్ బంక్‌లో కారులో రూ.1,500 పెట్రోల్ పోయించుకొని రూ.500 నకిలీ నోట్లు ఇచ్చారు.
మూడు ఒకే నంబర్‌తో ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బంక్‌లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించి, ఏపీలోని కాకినాడకు వెళ్లి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు వెహికల్స్‌ను సీజ్ చేశారు. కానుగంటి క్రాంతి, గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాశ్, కోన మధుకర్, సుంక సురేశ్‌కుమార్, కమాని అనిల్, బండారి సత్యానారాయణ, రామునాయక్, కందిమల్ల తిరుపతి, గోల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవనబోయిన సంపత్‌కుమార్ ను అరెస్ట్ చేయగా, కాకినాడకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
