గద్దల్లా వాలిన ఢిల్లీ నేతలను నమ్మొద్దు : తలసాని శ్రీనివాస్ యాదవ్

గద్దల్లా వాలిన ఢిల్లీ నేతలను నమ్మొద్దు : తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు : రాష్ట్రంలో గద్దల్లా వాలిన ఢిల్లీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని సనత్​నగర్​ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లకు సూచించారు. ఈ నెల 25న పరేడ్ గ్రౌండ్ లో సీఎం కేసీఆర్ సభ జరగనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం బహిరంగ సభకు సిటీలోని అన్ని సెగ్మెంట్లకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరానున్నారని ఆయన తెలిపారు.  

అనంతరం ఎస్​ఆర్​నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తి దాయకమని ఆయన కొనియాడారు. మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు. అమీర్ పేటలోని మున్సిపల్ గ్రౌండ్​లో ఉత్తర భారతీయ ప్రవాసీ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీపావళి స్నేహ సమ్మేళన్​కు తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు.

సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఇన్​చార్జి తలసాని సాయికిరణ్​యాదవ్, అగర్వాల్, జైన్, బెంగాలీ, రాజస్థాన్, మహేశ్వరి సమాజ్ నేతలు పాల్గొన్నారు. సనత్ నగర్ లోని సాయిబాబానగర్, దాసారం బస్తీ, ఎల్ఐజీ, సీ టైప్ క్వార్ట్స్, దాసారం హట్స్ ప్రాంతాల్లో తలసాని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తనను మరోసారి గెలిపించాలని కోరారు.