
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు గురువారం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బీఫామ్స్ అందజేయనున్నారు. అదే విధంగా ఎన్నికల ఖర్చు కోసం చెక్కులు కూడా ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలతో ఎన్నికల ప్రచారంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించిన కేసీఆర్.. సమావేశంలో రూట్ మ్యాప్‌పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.