మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​

మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు : మహారాష్ట్రపై బీఆర్ఎస్​ చీఫ్, సీఎం కేసీఆర్​ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే నాందేడ్​లో బహిరంగ సభ నిర్వహించి ఆ రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి రీజినల్​ కో ఆర్డినేటర్లను నియమించారు. ఈ నెల 26న కాందార్​లోహలో మరో భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు ప్రగతి భవన్​లో కేసీఆర్​ను కలిశారు. వారంతా ఎన్సీపీకి రాజీనామా చేసి బీఆర్​ఎస్​లో చేరబోతున్నారు.

కేసీఆర్​ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడు శంకరన్న ధోంగే, మాజీ ఎమ్మెల్యే నాగనాథ్ గిసేవాడ్, ఎన్సీపీ నాందేడ్ జిల్లా అధ్యక్షుడు దత్తా పవార్, ఎన్సీపీ యూత్ వింగ్​ సెక్రటరీ శివరాజ్ ధోంగే, నాయకులు శివదాస్ ధర్మపురికర్, మనోహర్ పాటిల్ భోసికర్, డాక్టర్ సునీల్ పాటిల్ఉన్నారు. సుభాశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.