- నేరస్తులు ఎట్లా ఎదుర్కొంటారో చూద్దాం
- కేసీఆర్ కు నోటీసులపై మాజీ ఎమ్మెల్సీ కవిత
- ఫోన్ ట్యాపింగ్ బాధాకరమని వ్యాఖ్య
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నేరస్తులు విచారణను ఎలా ఎదుర్కొం టారో చూడాలని అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనే కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. సిట్ విచారణ నాన్ సీరియస్ జరుగుతోం దని వ్యాఖ్యానించారు.
విచారణ ఎక్కడో ఒక దగ్గర పూర్తి కావాలని, ఇంతకూ ఎంక్వైరీ పూర్తి చేసే ఉద్దేశం ఉందా..? లేదా..? అనేది అర్థం కావడం లేదన్నారు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ బాధాకరమ ని వ్యాఖ్యానించారు.
