పోచారం లక్ష్మి పుత్రుడు కాదు.. లంక పుత్రుడు

పోచారం లక్ష్మి పుత్రుడు కాదు.. లంక పుత్రుడు

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాస్‌ రెడ్డి లక్ష్మి పుత్రుడు కాదని, లంక పుత్రుడుగా ఆయన మారిపోయారని బీఆర్‌‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు ఫైర్‌‌ అయ్యారు. ఈ మేరకు శనివారం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, బిగాల గణేశ్‌, మెతుకు ఆనంద్‌ మాట్లాడారు. బీఆర్‌‌ఎస్‌లో ఉన్నంత కాలం పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి, అన్ని పదవులు కట్టబెట్టారన్నారు. కేసీఆర్ ఆయనను లక్ష్మి పుత్రునిగా ప్రశంసించారని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి.. పోచారం కుటుంబం గురించి నీచంగా మాట్లాడారని, అయినా సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీలో చేరారని మండిపడ్డారు.