భట్టిపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం : అడ్లూరి లక్ష్మణ్

భట్టిపై బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ది తప్పుడు ప్రచారం :  అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారమంతా అవాస్తమని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. చిన్న సంఘటనను సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో దళిత సీఎం, దళితులకు మూడెకరాల పంపిణీ, దళిత బంధు అని ఇలా ఎన్నో రకాలుగా కేసీఆర్ మోసం చేశారన్నారు. కొప్పుల ఈశ్వర్, తాటికొండ రాజయ్యలను కేసీఆర్ ఎలా అవమానించారో ప్రజలు అంతా గమనించారని గుర్తుచేశారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో దళితులకు ఇండ్లు, భూములు ఎంత మందికి ఇచ్చారని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో సీఎంవో ఒక్క అధికారి కూడా దళిత వర్గానికి చెందిన వాళ్లు లేరన్నారు. ధర్మపురి నియోజకవర్గానికి నీళ్లు రాకుండా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌‌‌‌‌‌‌‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ను దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసన్నారు. దళితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.