మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పోటీ బీజేపీతోనే: కేటీఆర్

మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పోటీ బీజేపీతోనే: కేటీఆర్

మల్కాజిగిరి స్థానంలో తమ పోటీ బీజేపీతోనేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. శామిర్‌పేటలో జరిగిన మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.  మల్కాజిగిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని..  మన పోటీ కచ్చితంగా బీజేపీతోనే చెప్పారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌రిగిన పొర‌పాట్లను మ‌ళ్లీ జ‌ర‌గ‌నివ్వొద్దని కేటీఆర్ సూచించారు.   

రాష్ట్రంలో మళ్లీ వెనుకటి రోజులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని సీఎం రేవంత్ నిజాయితీగా ముందే చెప్పాడన్నారు కేటీఆర్.   మనమే ప్రజలకు సరిగ్గా చెప్పలేదన్నారు.  బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి ల‌క్ష్మారెడ్డి సామాజిక సేవ‌లు చేస్తూ మ‌ల్కాజ్‌గిరి పార్లమెంట్‌లోని ప్రజ‌ల‌తో క‌లిసి మెలిసి ఉన్నారు. బ్రహ్మాండంగా ఆయ‌నకు సేవాగుణం ఉంది. వారిని కేసీఆర్ పిలిచి ఆశీర్వదించి అభ్యర్థిగా ప్రక‌టించారు. 

ALSO READ | అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది