బీఆర్ఎస్ పాలనలో భవనాలపైనే తప్ప పరిపాలనపై శ్రద్ధ లేదు : ఎంపీ డాక్టర్ మల్లు రవి

బీఆర్ఎస్ పాలనలో భవనాలపైనే తప్ప పరిపాలనపై శ్రద్ధ లేదు : ఎంపీ డాక్టర్ మల్లు రవి
  •     ఎంపీ డాక్టర్​ మల్లు రవి

నాగర్​కర్నూల్, వెలుగు : తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కేవలం కొత్త సెక్రటేరియట్, ప్రగతి భవన్, కలెక్టరేట్ల లాంటి భవనాల నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప, సామాన్య ప్రజల సంక్షేమాన్ని, పరిపాలనను పట్టించుకోలేదని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి విమర్శించారు. గురువారం నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఒక నయా నవాబులా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని వృథా చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదని ఆరోపించారు.

ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రాను ఏర్పాటు చేసిందని, మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్‌‌‌‌కు పూర్వవైభవం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  సీఎం రేవంత్ రెడ్డిని ఒక డైనమిక్ విజనరీ లీడర్‌‌‌‌గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు.  ఆయన వెంట ​కాంగ్రెస్​నాయకులు మామిళ్లపల్లి విష్ణువర్దన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.