హన్వాడ, వెలుగు: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొనడంతో ఓ విద్యార్థి చనిపోగా, ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. హన్వాడ ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామాంజనేయులు కొడుకు చరణ్(15)ను తన సొంత ఆటోలో ఎక్కించుకొని మహబూబ్నగర్ కు బయలుదేరాడు.
మార్గమధ్యలో ఇద్దరు మహిళలను ఆటోలో ఎక్కించుకున్నాడు. పరిగి వెళ్లే ఆర్టీసీ బస్సు చిన్నదర్పల్లి సమీపంలో ఆటోను ఢీకొనడంతో చరణ్ అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు మహిళలను గాయాలయ్యాయి. వారిని మహబూబ్ నగర్ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
