బీఆర్ఎస్​ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్

బీఆర్ఎస్​ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లోక్​సభ బీఆర్ఎస్​ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్‌‌‌‌ను ఆ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ ఎంపిక చేశారు. సోమవారం శ్రీనివాస్‌‌‌‌ను అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో కాంగ్రెస్‌‌‌‌లో ఉన్న  శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు.

గోషామహల్ లో  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ముఖ్య నాయకుడిగా ఉన్నారు. హైదరాబాద్‌‌‌‌తో కలిపి ఇప్పటివరకు మొత్తం 17 సీట్లకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఇందులో ఆరుగురు బీసీలు, నలుగురు రెడ్లు ఉన్నారు. వెలమ, కమ్మ  వర్గం నుంచి ఒక్కో అభ్యర్థి ఉన్నారు. మిగిలిన ఐదింటిలో రెండు ఎస్టీ రిజర్వడ్, మూడు ఎస్సీ రిజర్వడ్ సీట్లు ఉన్నాయి. 

బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టు ఇదే..

1.    ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2.    మహబూబాబాద్(ఎస్టీ) – మాలోత్ కవిత
3.    కరీంనగర్ – బోయినపల్లి వినోద్ (ఓసీ)
4.    పెద్దపల్లి(ఎస్సీ) – -కొప్పుల ఈశ్వర్ 
5.    మహబూబ్ నగర్–-మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6.    చేవెళ్ల – -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7.    వరంగల్ (ఎస్సీ) –  కడియం కావ్య 
8.    నిజామాబాద్ – -బాజిరెడ్డి గోవర్ధన్ (బీసీ)
9.     జహీరాబాద్ – -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10.    ఆదిలాబాద్(ఎస్టీ)– -ఆత్రం సక్కు (ఆదివాసీ)
11.    మల్కాజ్ గిరి – -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12.    మెదక్ – -పి.వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13.    నాగర్ కర్నూల్ (ఎస్సీ )- – ఆర్ఎస్ ప్రవీణ్
14.    సికింద్రాబాద్ –  తీగుళ్ల పద్మారావు (బీసీ)
15.    భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16.    నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17.    హైదరాబాద్– గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)