
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ... మాజీ మంత్రి హరీష్రావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్ర జ్వరంతో పాటు క్షీణించిన ఆరోగ్యం కారణంగా బేగంపేట కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో చోటుచేసుకుంది. సమావేశం మధ్యలో హరీష్ రావు అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు.
హరీష్ రావు ప్రస్తుతం హై ఫీవర్ తో బాధపడుతున్నారని..ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పూర్తి మెడికల్ టెస్టులు జరిపిన తర్వాత పూర్తి స్థాయి ఆరోగ్య నివేదిక అందించనున్నారు.