టికెట్ ఇవ్వకుంటే రెబల్గా పోటీ చేస్తా: మనోహర్ రెడ్డి

టికెట్ ఇవ్వకుంటే రెబల్గా పోటీ చేస్తా: మనోహర్ రెడ్డి

మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని.. ఒకవేళ టికెట్ రాణి పక్షంలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాని బీఆర్ఎస్ నేత కొత్త మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 24న ఆయన తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని.. పార్టీ సమన్వయ కమిటీలో వారికి చోటు ఇవ్వడం లేదన్నారు. అవసరమైతే సమన్వయ కమిటీని తానే వేస్తానని కొత్త మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో కొందరు బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నరని మనోహర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మంత్రి సబితారెడ్డిపై ఆరోపణలు చేశారు కొత్త మనోహర్ రెడ్డి.

నియోజకవర్గంలో దళిత బంధు అందరికీ సమన్వయం చేసి ఇవ్వాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని మనోహర్ రెడ్డి హెచ్చరించారు. మంత్రి సబితారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారని ఆగ్రహించారు.మంత్రి అనుచరులు, కుమారుడు కలిసి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని రోజు పేపర్ లో వస్తుందని మనోహర్ రెడ్డి మండిపడ్డారు. దీంతో మహేశ్వరం నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని వ్యాఖ్యనించారు.