- ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్, వెలుగు: చైనా మాంజా అమ్మినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ఎస్పీ నితికా పంత్ హెచ్చరించారు. శుక్రవారం ఆమె ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చైనా మాంజా ప్రాణాంతకమని, వాహనదారులు, పాదచారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బైక్‌లపై వేగంగా వెళ్తున్నప్పుడు ఈ దారం మెడకు, ముఖానికి తగిలితే తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉందన్నారు.
వాహనదారులు పూర్తి ముఖాన్ని కవర్ చేసే విండ్ షీల్డ్ ఉన్న హెల్మెట్ ధరించాలని, ఫ్లైఓవర్లు, గాలిపటాలు ఎక్కువగా ఎగిరే ప్రాంతాల్లో వేగం తగ్గించాలని సూచించారు. చైనీస్ మాంజా అమ్మకం, వినియోగం చట్టరీత్యా నేరమని, భారీ జరిమానాతో పాటు ఏడేండ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. చైనా మాంజా సమాచారం తెలిస్తే పోలీసులకు నేరుగా, లేదా డయల్ 100 తెలియజేయాలని ప్రజలను కోరారు.
