నేరడిగొండ, వెలుగు: కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమం సాధ్యమని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలం వడూర్‌కు చెందిన దాదాపు 70 మంది బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి గజేందర్కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 20 ఏండ్లుగా బీఆర్ఎస్ కోసం, ఎమ్మెల్యే కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ ప్రతి విషయంలోనూ తమను ఆయన మోసం చేశారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ... ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనను కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ లో చేరిన ప్రతి కార్యకర్తను గౌరవిస్తూ, అందరిని కలుపుకొని వడూర్ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన అందూర్సర్పంచ్
బోథ్ మండలంలోని అందూర్లో సర్పంచ్ పెందూర్ పృథ్వీరాజ్, ఉప సర్పంచ్ మడావి సంతోష్‌తో పాటు బీఆర్ఎస్కు చెందిన మాజీ సర్పంచ్ అయినవేని రాజు తదితరులు గజేందర్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. కార్యక్రమంలో అబుల్క మహేందర్, పాల కార్తీక్ , గాదే ఉపేందర్, బుక రవికాంత్, సింగం జగదీశ్, తెడ్డు అశోక్, గాదే నడిపి ఉషన్న తదితరులు పాల్గొన్నారు.
