- రెండో రోజుల గెలిచిన మంచిర్యాల, నిర్మల్ జట్లు
కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం13 బెటాలియన్ పోలీస్ గ్రౌండ్స్‌లో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాక ఇండస్ట్రీస్ సౌజన్యంతో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయిలో పోటీల్లో మంచిర్యాల, నిర్మల్జట్లు గెలుపొందాయి.
ఉదయం నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్ చేసిన నిర్మల్ 9 వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. జాదవ్ యువరాజ్ 28 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అవినాశ్ జాదవ్ 28, వినయ్ 25 రన్స్ చేశారు. బౌలర్ మోరే ఆకాశ్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఆసిఫాబాద్ జట్టు 19.4 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వినయ్ నాలుగు వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లో సత్తాచాటిన వినయ్‌కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆదిలాబాద్‌ను కట్టడిచేసిన మంచిర్యాల
మరో మ్యాచ్‌లో ఆదిలాబాద్ జట్టుపై మంచిర్యాల విజయం సాధించింది. మొదట బ్యాటింగ్చేసిన మంచిర్యాల 18 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 రన్స్ చేసింది. సాయికృష్ణ(37), ఇస్మాయిల్ అహ్మద్(29) రాణించారు. బౌలర్లు సైక్ ఆమన్, చందన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ దిగిన ఆదిలాబాద్ టీమ్ నిర్ణీత ఓవర్డలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 113 రన్స్మాత్రమే చేశారు. 35 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన మంచిర్యాల కెప్టెన్ సాయికృష్ణారెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. హెచ్‌సీఏ కోచ్ ప్రదీప్ అవార్డులు అందజేశారు.
