చెట్టుపై దారానికి చిక్కుకున్న గద్ద

చెట్టుపై దారానికి చిక్కుకున్న గద్ద

ఓల్డ్​సిటీ, వెలుగు: చెట్టుపై దారానికి చిక్కుకున్న గద్దను ఫైర్​ అధికారులు చాకచక్యంగా కాపాడారు. గురువారం మధ్యాహ్నం  హైకోర్టు గేట్​ నంబర్​‌‌‌‌‌‌‌‌ 3 వద్ద ఉన్న వేపచెట్టుపై గద్ద వాలింది. అక్కడే ఉన్న పతంగులు ఎగురవేసేందుకు ఉపయోగించే దారంలో ఆ పక్షి చిక్కుకుంది. ఇది గమనించిన అగ్నిమాపక ఉద్యోగులు నర్సింగ్​ యాదవ్​, ఆర్​.మహేశ్​ రాథోడ్​, కె.కొమ్రెల్లి చాకచక్యంగా చెట్టుపైకి ఎక్కి ఆ దారాన్ని తెంపేసి దానిని రక్షించారు. గద్దకు నీళ్లు తాగించి గాలిలో వదిలేశారు.