లోకేశ్వరం, వెలుగు: లోకేశ్వరం మండల సర్పంచ్ల కార్యవర్గాన్ని గురువారం పార్టీలకతీతంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఇటీవల ఎన్నికైన సర్పంచ్ చర్చలు జరిపి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కరిపె శోభారాణి, అధ్యక్షుడిగా కదం భుజంగరావు, ఉపాధ్యక్షులుగా శ్యామల గౌడ్, ప్రధాన కార్యదర్శిగా దడిగె జయలలిత, జాయింట్ సెక్రటరీగా గడ్డం బచ్చన్న , కోశాధికారిగా షాపురం రాణి, సోషల్ మీడియా కన్వీనర్ గా బాతూరి వెంకటేశ్ ఎన్నికయ్యారు.
కుభీర్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా కందూర్ సాయినాథ్
కుభీర్, వెలుగు: కుభీర్ మండల సర్పంచ్ల సంఘం కార్యవర్గాన్ని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందూర్ సాయినాథ్(కుభీర్), ప్రధాన కార్యదర్శిగా జాజుల దేవేందర్(చాత), ఉపాధ్యక్షుడిగా క్రాంతిరాజ్(ఫకీర్ నాయక్ తండా) ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ.. 24 మంది సర్పంచ్ల మద్దతుతో మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు.
కొందరు సర్పంచ్లు మెజారిటీ లేకున్నా తమకు తామే మండల అధ్యక్షులుగా ప్రకటించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తూ సర్పంచ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బషీర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, నాయకులు విజయ్ కుమార్, బంక బాబు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.
