
- భారీ వరదలొస్తే..మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోతదేమో!
- ప్రభుత్వం కూడా అదే కోరుకుంటోంది: కేటీఆర్
- అందుకే రిపేర్లు చేయిస్తలేదు
- మంత్రి ఉత్తమ్‌కు బ్యారేజీకి, రిజర్వాయర్‌కు తేడా తెల్వదు
- వెంటనే నిపుణుల కమిటీ వేసి రిపేర్లు చేయించాలి
- చేతకాకపోతే తమకు అప్పగించాలని సవాల్
- తెలంగాణ భవన్లో మీడియాతో చిట్‌చాట్
- ఇయ్యాల తెలంగాణ భవన్ నుంచి 5 బస్సుల్లో వెళ్లనున్న నేతలు
- మొదట మేడిగడ్డ బ్యారేజీ సందర్శన.. అక్కడి నుంచి అన్నారం
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం.. మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లనుంది. ఆ పార్టీ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్ నుంచి ఉదయం 8:30 గంటలకు 5 బస్సుల్లో మేడిగడ్డకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు దాదాపు 200 మంది నాయకులు వస్తారని బీఆర్ఎస్ ప్రకటించింది. తెలంగాణ భవన్ నుంచి ఉప్పల్, ఘట్కేసర్, జనగామ, వరంగల్ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. భూపాలపల్లిలో లంచ్ చేసిన తర్వాత మేడిగడ్డకు వెళ్తారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత అన్నారం బ్యారేజీకి వెళ్లనున్నారు. అన్నారంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి మీడియా సమావేశంలో ప్రాజెక్టు గురించి మాట్లాడుతారని పార్టీ వెల్లడించింది. ఆ తర్వాత నేతలందరూ అన్నారం నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.