
మేడిపల్లి, వెలుగు : మేడ్చల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్‌ను గెలిపిస్తామని బీఆర్‌ఎస్ నేతలే మాటిచ్చారని ఆ పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పోగుల నర్సింహా రెడ్డి తెలిపారు. బోడుప్పల్‌లోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
మంత్రి మల్లారెడ్డి కావాలనే వజ్రేశ్ యాదవ్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వక్ప్ భూముల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని బోడుప్పల్‌లో అమరణ దీక్షలు చేసినా ఆయన ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
సమావేశంలో కార్పొరేటర్లు రాసాల వెంకటేశ్, కొత్త దుర్గమ్మ, తోటకూర అజయ్ యాదవ్, కల్యాణ్ బొమ్మకు, నాయకులు రాపోలు రాములు, గందె విశ్వం, జెన్నా రాజు, అసర్ల బీరప్ప తదితరులు పాల్గొన్నారు.